Magazines

సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం

1 గంట క్రితం

Sarampalli Mallareddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 2 నిమిషాల చదవడం

రైతాంగ హక్కుల కోసం ఆయన సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకం : సంస్మరణ సభలో మాజీ ఎమ్మెల్యే, 
అఖిల భారత కిసాన్‌ సభ కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-ముషీరాబాద్‌

అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) జాతీయ మాజీ ఉపాధ్యక్షులు, రైతాంగ ఉద్యమ నేత సారంపల్లి మల్లారెడ్డి జీవితం, రైతాంగ హక్కుల సాధన కోసం ఆయన చేసిన పోరాటాలు చిరస్మరణీయమని ఏఐకేఎస్‌ ‌కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌ రావు, టి. సాగర్‌ అన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభలో వారు మాట్లాడుతూ.. సారంపల్లి మల్లారెడ్డి రైతాంగ సమస్యల పరిష్కారం కోసం చేసిన కృషిని, రైతుల హక్కుల పరిరక్షణకు సాగించిన ఉద్యమాలను స్మరించుకున్నారు. రైతాంగాన్ని సంఘటితం చేయడంలో, వ్యవసాయ రంగ సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో మల్లారెడ్డి పోషించిన పాత్రను కొనియాడారు. రైతాంగ సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని వివరించారు. రైతుల సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, రైతాంగ ఉద్యమ బలోపేతానికి కృషి చేసిన సారంపల్లి మల్లారెడ్డి సేవలు వామపక్ష ఉద్యమానికి, రైతాంగ పోరాటాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాల సాధనకు రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని, 24 శాతం లోటు వర్షపాతంతో పంటలకు భారీ నష్టం వాటిల్లిందని, దిగుబడులు తగ్గిపోతున్నాయని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు ఆహార పంటలకు ఎకరాకు రూ.30వేలు, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50వేల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ సంస్మరణ సభలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి మూడ్‌ శోభన్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. జంగారెడ్డి, ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు, కందాల ప్రమీల, సుధాకర్‌ రెడ్డి, మాదినేని రమేష్‌, తుమ్మల వెంకట్‌ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఉడత రవీందర్‌, బొంతు రాంబాబు, అన్నవరపు సత్యనారాయణ, మల్లు నాగార్జున రెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మాటూరు బాలరాజు గౌడ్‌, భుక్య చందు నాయక్‌, వర్ణ వెంకట్‌ రెడ్డి, కొంగరి వెంకట్‌ మావో, డి. బాలరెడ్డి, ఎం. శ్రీనివాస్‌, పల్లపు వెంకటేష్‌, దుబ్బాక రామచందర్‌, కొక్కొరపాటి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్