Magazines

చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో
 రేవ్‌ పార్టీ కలకలం

1 గంట క్రితం

Commotion over a rave party at a Chevella farmhouse
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

108 మంది విద్యార్థుల హాజరు

ముగ్గురికి గంజాయి పాజిటివ్‌

​ఐక్యూ ఫై కళాశాల విద్యార్థులే అధికం

ఎస్‌ఓటీ పోలీసుల మెరుపు దాడి

​నవతెలంగాణ- చేవెళ్ల

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని ఓ ఫామ్‌హౌస్‌లో రహస్యంగా నిర్వహిస్తున్న రేవ్‌ పార్టీని ‌ఎస్‌ఓటీ, చేవెళ్ల పోలీసులు సంయుక్తంగా భగ్నం చేశారు. ఈ పార్టీలో సుమారు 108 మంది విద్యార్థులు పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. నిర్వహించిన డ్రగ్స్‌ పరీక్షల్లో ముగ్గురికి గంజాయి పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పార్టీ నిర్వాహకుడితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేవెళ్ల సీఐ కట్టా నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధి కమ్మెట గ్రామ సమీపంలోని ఎల్జీ ఫామ్‌హౌస్‌లో అక్టోబర్‌ 30న ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ నిర్వహిస్తున్నట్టు ​నమ్మదగిన సమాచారం మేరకు ఎస్‌ఓటీ, చేవెళ్ల పోలీసులు ఫామ్‌హౌస్‌పై నిఘా పెట్టారు. ప్రధాన నిర్వా హకునిగా పేర్కొంటున్న మన్నన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా యువతకు ఆహ్వానాలు పంపించాడు. పార్టీకి హాజరయ్యే వారి నుంచి రూ.1,000 నుంచి రూ.2వేలు వరకు ఎంట్రీ ఫీజు వసూలు చేసి, చివరి నిమిషంలో మాత్రమే ఫామ్‌హౌస్‌ చిరునామాను పంపించినట్టు తెలిసింది. హైదరాబాద్‌ లోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 108 మంది విద్యార్థులు ఈ పార్టీలో పాల్గొన్నారు. వీరిలో ఐక్యూ ఫై కళాశాలకు చెందిన విద్యార్థులే అధికంగా ఉన్నట్టు గుర్తించారు. నిర్వాహకుడు మన్నన్‌ గతంలో అదే కళాశాలలో ఫ్రెషర్స్‌ డే కార్యక్రమం నిర్వహించడంతో విద్యార్థులతో పరిచయం ఏర్పడి నట్టు సమాచారం. ఆ పరిచయంతోనే వారిని పార్టీకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. కాగా, డ్రగ్స్‌ పరీక్షల్లో నిర్వాహకుడు మన్నన్‌తో పాటు మరో ఇద్దరు విద్యార్థులకు గంజాయి పాజిటివ్‌గా వచ్చినట్టు పోలీసులు వెల్లడిం చారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు చేవెళ్ల సీఐ తెలిపారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్