Magazines

ప్రభుత్వ భూములను వేలం వేయొద్దు

8 నిమిషాల క్రితం

Do not auction government lands
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

ఎంపీ ఆర్.కృష్ణయ్య

ఇందిరాపార్క్‌ ‌వద్ద మహాధర్నా

​నవతెలంగాణ - ముషీరాబాద్

​ప్రభుత్వ భూములను వేలం వేయొద్దని, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీలపల్లి అంజి అధ్యక్షతన ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఆదివారం మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 325 హాస్టల్లో 320 బీసీ గురుకులాలు, 50 ఎస్సీ గురుకులాలకు సొంత భవనాలు లేవన్నారు. అద్దె భవనాల్లో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మిస్తే విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు విద్యా ప్రమాణాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం వెంటనే మియాపూర్ భూముల్లో హాస్టళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని, సీఎం ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. హాస్టళ్లకు గురుకులాలకు సొంత భవనాలకు ప్రభుత్వ భూములు కేటాయిస్తే భవన నిర్మాణానికి 80 శాతం గ్రాండ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. మల్టీ నేషనల్ కంపెనీల నుంచి సీఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని భవనాలను నిర్మించాలని, దీనికి పార్లమెంట్ లో చర్చిస్తామన్నారు. ఐదు మంది విద్యార్థులు ఉండాల్సిన గదుల్లో 20 నుంచి 30 మంది ఉంటున్నారని, దీనివలన విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. అధికారులు విద్యార్థులకు సౌకర్యం కల్పించాలనే కోణంలో చూడకుండా ప్రభుత్వానికి డబ్బు ఎలా ఆదా చేయాలని చూస్తున్నారన్నారు. ఇండ్లు లేని పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు 240 రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయాలన్నారు. ఈ ధర్నాలో నిరుద్యోగ జేఏసీ చైర్మెన్ నీలా వెంకటేష్, అనంతయ్య, రాజేందర్, నరేష్ గౌడ్, శివ ముదిరాజ్, భీమయ్య తదితరు నాయకులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్