Magazines

డిజిటల్ హెల్త్ పై అవగాహన పెంచుకోవాలి

12 నిమిషాల క్రితం

One should raise awareness about digital health.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

తెలంగాణ నర్సెస్ అసోసియేషన్

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

నర్సింగ్ ఆఫీసర్లు డిజిటల్ హెల్త్ పై మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరముందని తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ (టీఎన్ఏ) సూచించింది. న్యూఢిల్లీలో ఆల్ ఇండియా గవర్నమెంట్ నర్సెస్ ఫెడరేషన్ (ఏఐజీఎన్ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ డిజిటల్ హెల్త్ సమ్మిట్ - 2026లో అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు. 1988 తర్వాత ఫెడరేషన్ నిర్వహించిన సమ్మిట్ కు మళ్లీ ఈ ఏడాది రాష్ట్రం నుంచి ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్లు హాజరయినట్టు వారు తెలిపారు. తెలంగాణ నుంచి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లలిత, ఉపాధ్యక్షురాలు ఆరోగ్యజ్యోతి, కోశాధికారి స్వర్ణలత, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాపోలు శేఖర్. జాయింట్ సెక్రెటరీలు భవానీ, లక్ష్మణ్, కమిటీ సభ్యులు భానవత్ క్రిష్ణ హాజరయ్యారు. సమ్మిట్ లో పాల్గొనడం తెలంగాణ ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్లకు దొరికిన గొప్ప అవకాశమనీ, జాతీయ స్థాయిలో నర్సింగ్ రంగంలోని అనుభవాలు, ఆలోచనలు, అభివృద్ధి అవకాశాలను పరస్పరం పంచుకోవడానికి ఉపయోగపడిందని వారు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్