Magazines

బాలికపై జిమ్‌ ట్రైనర్‌ ‌లైంగికదాడి

1 గంట క్రితం

Gym trainer sexually assaults a girl
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం

నవతెలంగాణ– బంజారాహిల్స్‌

​అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన కల్ట్‌ ఫిట్‌ జిమ్‌లో బాలికకు భద్రత కరువైంది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లోని జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్న రవి అనే వ్యక్తి బాలికను పెండ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మధురానగర్‌ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, కేసును బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీసీఓడీ, శారీరక దృఢత్వ సమస్యలతో బాధపడుతున్న ఓ బాలిక వైద్యుల సూచన మేరకు ఆరోగ్యం పట్ల శ్రద్ధతో గతేడాది జూన్‌లో బంజారాహిల్స్‌ని కల్ట్‌ ఫిట్‌ జిమ్‌లో చేరింది. అక్కడ ప్రత్యేక సహాయకుడిగా పని చేస్తున్న రవి, నమ్మకస్తుడిగా ఉంటూ బాలికతో స్నేహం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే బాలికకు వాట్సప్‌‌లో అసభ్యకర సందేశాలు పంపేవాడు. అంతేకాక ఆమెను పెండ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక కోరికలు తీర్చాలంటూ ఒత్తిడి చేసినట్టు బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. జిమ్‌లోనే బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నట్టు ఆరోపించారు. గతంలోనూ రవి మరో మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టంతోపాటు బీఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్