ఎన్వీఎస్-3 ఉపగ్రహం విజయవంతం పట్ల ఇస్రో శాస్ర్తవేత్తలు, ఇంజినీర్లకు సీఎం రేవంత్రెడ్డి అభినందనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా ఎన్వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన సందర్భంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి శనివారం ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఉపగ్రహా న్ని నిర్దేశిత భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టడం భారత నావిగేషన్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే కీలక మైలురాయి అని ప్రశం సించారు. రవాణా, విమానయానం, సముద్ర నావిగేషన్, పర్యవేక్షణ, అత్యవసర సేవల వంటి కీలక రంగాల్లో ఎన్వీఎస్-03 మెరుగైన సేవలు అందించనుందని పేర్కొన్నారు. ఈ విజయం యావత్ దేశానికి గర్వకారణమని, భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.






కామెంట్లు (0)