Magazines

మావోయిస్టుల 
భారీ ఆయుధ డంప్‌ స్వాధీనం

40 నిమిషాల క్రితం

Maoist arms dump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం

పూసుగుప్ప అటవీ ప్రాంతంలో 
మూడు భారీ బీజీఎల్‌ షెల్స్‌ డంపుల గుర్తింపు

వివరాలు వెల్లడించిన ‌భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్

నవతెలంగాణ-చర్ల

తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని పూసుగుప్ప, పూజారికాంకేర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన మూడు ఆయుధ డంపులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్‌ 16న ప్రత్యేక పోలీసు బృందాలు, బీడీ టీమ్‌తో నిర్వహించిన గాలింపులో భూమిలో పాతిపెట్టిన మూడు ప్లాస్టిక్‌ వాటర్‌ ట్యాంకుల్లో దాచిన మొత్తం 280 బీజీఎల్‌ (బ్యారెల్‌ గ్రెనేడ్‌ లాంచర్‌) షెల్స్‌ను గుర్తించినట్టు జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజ్‌ విలేకరులకు ఒక ప్రకటనలో వెల్లడించారు. 2025లో పీఎల్‌జీఏ బెటాలియన్‌ వికేంద్రీకరణ సమయంలో మొదటి కంపెనీకి చెందిన ఈ షెల్స్‌ను భవిష్యత్తు అవసరాల కోసం అటవీ ప్రాంతంలో దాచినట్టు ఎస్పీ తెలిపారు. దట్టమైన అటవీ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా భావించిన మావోయిస్టులు భవిష్యత్తు అవసరాల కోసం ఆయుధ సామగ్రిని అక్కడ నిల్వ చేసినట్టు చెప్పారు. మావోయిస్టుల కార్యకలాపాల నియంత్రణకు అటవీ ప్రాంతాల్లో గాలింపు కొనసాగిస్తామని తెలిపారు. లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావాలని అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం అందిస్తున్న పునరావాస సహాయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతితో పాటు మరికొందరు మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని. వారంతా హింసామార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నట్టు తెలిపారు. అయితే మొట్టమొదటిసారి ఇంత పెద్ద మొత్తంలో బీజీఎల్ షెల్స్ గుర్తించి స్వాధీన పరుచుకున్న భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్, చర్ల సీఐ రాజు వర్మ, ఎస్సై నర్సిరెడ్డి, స్పెషల్ పార్టీ పోలీస్ బలగాలు, సీఆర్పీఎఫ్ బలగాలను ఎస్పీ అభినందించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్