నవతెలంగాణ- పెద్దశంకరంపేట
కన్న తల్లిని రోకలి బండతో కొడుకు కడతేర్చిన సంఘటన పెద్దశంకరంపేట మండలం శివయపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది, ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి, స్థానికుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని శివయపల్లి గ్రామానికి చెందిన చిలుక ముక్కు పద్మమ్మ (73) కుమారుడు పాపయ్య డబ్బుల విషయంలో తల్లితో పాటు అతని భార్య నిర్మలతో గొడవ పడ్డారు. ఈ క్రమంలో తన తల్లి పద్మమ్మతో డబ్బుల విషయంలో సమస్య ఉందని..తల్లిని చంపాలనే ఉద్దేశ్యంతో రోకలిబండ తీసుకొని పద్మమ్మ తలపై కొట్టాడు. దీంతో తీవ్రగాయాలై రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో నారాయణఖేడ్ దవాఖానకు తరలించారు. మంగళవారం ఉదయం డ్యూటీ డాక్టర్ ఆమె చనిపోయినట్టు దృవీకరించారు. మృతురాలి అక్క కొడుకు కృష్ణ పిర్యాదు మేరకు కేసు నమదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ ఐ తెలిపారు.





కామెంట్‌లు (0)