నిరంతర పియుఎఫ్ ప్యానెల్ యూనిట్ ప్రారంభం
నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణలో తొలి నిరంతర శాండ్విచ్ పీయూఎఫ్ (పియుఎఫ్) ప్యానెల్ తయారీ కేంద్రాన్ని మౌంట్ రూఫింగ్ అండ్ స్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లో ప్రారం భించింది. ఈ కేంద్రంలో తొలి విడతగా నెలకు 3 లక్షల చదరపు మీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో కార్య కలాపాలు మొదలయ్యాయి.సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పరిశ్రమను కేవలం మూడు నెలల్లో నిర్మించారు. రాబోయే మూడు నెలల్లో నెలకు 2 లక్షల చదరపు మీటర్ల సామర్థ్యంతో రాక్వుల్ శాండ్విచ్ ప్యానెల్ తయారీ లైన్ను ప్రారంభించనున్నారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పారిశ్రామిక నిర్మాణాలు, శీతల నిల్వ కేంద్రాలు, గిడ్డంగులు, ఆహార శుద్ధి, ఔషధ పరిశ్రమలకు అవసరమైన ఉష్ణ నిరోధక నిర్మాణ సామగ్రిని వేగంగా సరఫరా చేసేందుకు ఈ కేంద్రం దోహదపడనుందని ఆ సంస్థ యాజమాన్యం తెలిపింది.






కామెంట్లు (0)