అధికారులకు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశం
నేడు మళ్లీ సమావేశం కావాలని నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సమ్మక్క-సారక్క బ్యారేజ్ డిటేయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) వెనక్కి పంపడంతో సర్కార్ అప్రమత్తమైంది. సీడబ్ల్యూసీ లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చించేందుకు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లోని బీఆర్.అంబేడ్కర్ సచివాల యంలో బుధవారం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ప్రాజెక్ట్ చివరి ఫార్మ్ గేట్ల వరకు రవాణా వ్యవస్థను అంచనా వేయడం కోసం కమాండ్ ఏరియాలోని భూభాగ పరిస్థి తులకు ప్రాతినిధ్యం వహించే మూడు ప్యాచ్ ల్లో 10శాతం పరిశీలించామని ‘సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ)కు సమర్పించిన సర్టిఫికేట్‌లో పేర్కొన్నామని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. అయితే సీడబ్ల్యూసీ అక్టోబర్ 15న రాసిన లేఖలో చివరి ఆయకట్టు వరకు 100 శాతం ధ్రువీకరించా లని పేర్కొందని వివరించారు. సమయాభావం వల్ల తాము వంద శాతం ఆయకట్టు వివరాలను నమోదు చేయలేదని తెలిపారు. సీడబ్ల్యూసీ సూచనల మేరకు తిరిగి డీపీఆర్‌ను వెంటనే పంపించాలని నీటి పారుదల శాఖ అధికారులను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. కాగా పూర్తి వివరాలు అధికారులు అందించక పోవడంతో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరిగి నేడు సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇ. శ్రీధర్, ఈఎన్సీలు రమేశ్‌బాబు, ప్రసాద్, సహాయ కార్యదర్శి కే. శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)