ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శికి టీజీటీఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని తహశీల్దార్లకు పెండింగ్‌లో బిల్లులను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ తహశీల్దార్ల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మెన్ వి లచ్చిరెడ్డి, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రాములు, ప్రధాన కార్యదర్శి రమేశ్ పాక కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ విజ్ఞప్తిపై ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. పెండింగ్ బిల్లుల విడుదలకు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.






కామెంట్‌లు (0)