Magazines

‘ఇండస్ మెడికేర్’లో సీఐటీయూ ఘనవిజయం

1 గంట క్రితం

Resounding victory for CITU at ‘Indus Medicare’
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 2 నిమిషాల చదవడం

ఐఎన్‌టీయూసీ, బీఆర్‌‌టీయూ అపవిత్ర కూటమికి పరాభవం
ఇది కార్మిక విజయం: సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్

నవతెలంగాణ-తూప్రాన్/మనోహరాబాద్

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామయిపల్లి శివారులోని ఇండస్ మెడికేర్ పరిశ్రమలో మంగళవారం జరిగిన కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ, బీఆర్‌‌టీయూ కూటమిపై సీఐటీయూ ఘన విజయం సాధించింది. మొత్తం 63 ఓట్ల కు గాను 63 ఓట్లు పోల్ కాగా సీఐటీయూకు 38, ఐఎన్‌‌టీయూసీ కూటమికి 25 ఓట్లు వచ్చినాయి. దీంతో సీఐటీయూకు 13 ఓట్ల మెజారిటీ వచ్చింది. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మనోహరాబాద్ మాజీ సర్పంచ్ మహిపాల్ రెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ చేతిలో ఓటమి చెందారు. దీంతో సీఐటీయూ నాయకులు, కార్మికులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. సంబరాల అనంతరం యూనియన్ అధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లికార్జున్ మాట్లాడుతూ.. ప్రత్యర్థులు ఎన్ని ప్రలోబాలకు గురి చేసినా సీఐటీయూకు ఘన విజయం అందించిన కార్మికులకు ధన్యవాదాలు తెలియజేసారు. సీఐటీయూ విజయం కార్మిక విజయమని అన్నారు. మాపై కార్మికులు పెట్టుకున్న ఆశలకు అనుగుణంగా యాజమాన్యంతో చర్చించి కార్మికుల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తామన్నారు. పారిశ్రామిక ప్రాంతంలోనే మెరుగైన వేతన ఒప్పందం సాధించేందుకు కృషి చేస్తామన్నారు. కార్మిక సంఘాల ఎన్నికల్లో డబ్బు పంపిణీ, మద్యం పంపిణీ, బెదిరింపులు సరైన పద్ధతి కాదన్నారు. ప్రత్యర్థి యూనియన్ ఎన్ని ప్రలోబాలకు గురి చేసినా లొంగకుండా నిజాయతీగా ఓట్లు వేసిన కార్మికులను అభినందించారు. కేవలం పరిశ్రమ లోని సమస్యలే కాకుండా దేశంలో పాలకులు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానల పై కార్మిక వర్గం పక్షాన పోరాటాలకు సీఐటీయూ సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా కృషి చేసిన కార్మిక శాఖకు, యాజమాన్యానికి, పోలీసులకు, పత్రికా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం, ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, యూనియన్ ప్రధాన కార్యదర్శి బాలేష్, నాయకులు సుజాత, తిరుపతి, పూర్ణేశ్, ఉపేంద్ర, విక్రమ్ రెడ్డి, రమేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్