చిల్లర వివాదంలో ప్రయాణికురాలు తోసేయడంతో తీవ్ర గాయాలు
నవతెలంగాణ-డెస్క్
చిల్లర విషయంలో తలెత్తిన వివాదం మహిళా ఆర్టీసీ కండక్టర్ ప్రాణాలను బలితీసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపోకు చెందిన కండక్టర్ గుండ్ల ప్రవళిక (30) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి పరిస్థితి విషమించి మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం బస్సులో ప్రయాణికురాలితో జరిగిన వివాదంలో కదులుతున్న బస్సులోంచి కిందపడిన ఆమెపై వెనుక చక్రాలు వెళ్లడంతో రెండు కాళ్లు తీవ్రంగా నలిగిన విషయం తెలిసిందే. దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రవళిక ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.






కామెంట్‌లు (0)