Magazines

మున్సిపల్ కార్మికులను పరామర్శించిన ఇప్ప శ్రీనివాస్

29 నిమిషాల క్రితం

municipal workers
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - కామారెడ్డి

జిల్లా కేంద్రంలోని ప్రియా టాకీస్‌ రోడ్డుపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది (ఆటోలో ప్రయాణిస్తున్న) మున్సిపల్ కార్మికులు గాయపడ్డారు. ఆటోకు ద్విచక్ర వాహనం అడ్డురావడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడి ప్రమాదం చోటుచేసుకుంది.


ఇందులో (లలిత, రాజమణి, రవళి, స్వప్న, విజయ, మరియా ) పరిస్థితి సాధారణంగా ఉండగా, కనకవ్వ, సావిత్రిల పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రస్తుతం వీరికి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందుతోంది. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఇప్ప శ్రీనివాస్ బుధవారం ఆస్పత్రికి చేరుకుని క్ష‍తగాత్రులను పరామర్శించారు. అదేవిధంగా గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ కనకవ్వ, సావిత్రిలకు మెరుగైన వైద్యం అందించాలని ఆర్‌ఎంఓ సంతోష్‌తో పాటు వైద్యులకు సూచించారు. బాదితులు అధైర్య పడొద్దనీ, ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్