నవతెలంగాణ - హైదరాబాద్ : 2026 మిస్ యూనివర్స్ కిరీటాన్ని ప్యూర్టోరికోకు చెందిన జెన్నిఫర్ బారెటో గెలుచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 130కి పైగా దేశాల నుంచి పోటీదారులు పాల్గొన్న ఈ అందాల పోటీలో ఆమె విజేతగా నిలిచారు. శాన్ జువాన్‌లోని జోస్ మిగుయెల్ అగ్రెలాట్ కొలీజియంలో జరిగిన వేడుకలో మెక్సికోకు చెందిన మాజీ విజేత ఫాతిమా బోష్ జెన్నిఫర్‌కు కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీలో డొమినికన్ రిపబ్లిక్, వెనిజులా దేశాలకు చెందిన పోటీదారులు రన్నరప్‌లుగా నిలిచారు. ఈ విజయంతో ప్యూర్టోరికోకు మిస్ యూనివర్స్ కిరీటం ఆరోసారి దక్కింది. వీసా సమస్యలు, పలు దేశాల పోటీదారులు వైదొలగడం వంటి వివాదాల మధ్య ఈ ఏడాది పోటీలు నిర్వహించబడ్డాయి.
ప్యూర్టోరికోకు మిస్ యూనివర్స్ కిరీటం
52 నిమిషాల క్రితం

Puerto Rico
వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)