నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ (విజయ తెలంగాణ) పలు రకాల పాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఈ నెల 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. డబుల్ టోన్డ్, కౌ మిల్క్, టోన్డ్ మిల్క్, స్పెషల్ టీఎం 500 మి.లీ. ప్యాకెట్లపై రూ.1 పెంచగా, టోన్డ్ మిల్క్ 1,000 మి.లీ. ప్యాకెట్‌పై రూ.2 పెంచింది. అయితే 150 మి.లీ., 200 మి.లీ. చిన్న ప్యాకెట్లు, 500 మి.లీ. స్టాండర్డైజ్డ్ పాల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.
విజయ పాల ధరలు పెంపు.. ఈ నెల 25 నుంచే కొత్త ధరలు
12 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)