Magazines

బియ్యం ధరలు తగ్గుముఖం..

42 నిమిషాల క్రితం

Rice prices are falling..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : వినియోగదారులకు ఊరటనిస్తూ బియ్యం ధరలు తగ్గుముఖం పట్టాయి. గత నెల రోజుల్లో కిలో బియ్యంపై సగటున రూ.10 వరకు తగ్గినట్లు సమాచారం. ప్రభుత్వం ధరల నియంత్రణ చర్యలు చేపట్టడం, అక్రమ నిల్వలపై పౌరసరఫరాల శాఖ దాడులు నిర్వహించడంతో మార్కెట్లో ధరలు దిగివచ్చాయి.

గత నెలలో ఎల్‌నినో ప్రభావం, భవిష్యత్తులో బియ్యం కొరత ఏర్పడుతుందనే ప్రచారంతో వ్యాపారులు ధరలు పెంచగా, కొన్ని ప్రాంతాల్లో సన్న బియ్యం కిలో రూ.100 వరకు విక్రయించారు. దీంతో ప్రభుత్వం బీపీటీ, కేఎన్ఎం బియ్యం కిలో రూ.66, తెలంగాణ సోనా రూ.74, హెచ్‌ఎంటీ రూ.79కు మించి విక్రయించరాదని ఆదేశాలు జారీ చేసింది. అధిక ధరలకు అమ్మిన వారిపై చర్యలు తీసుకోవడంతో ధరలు తగ్గాయి.

మార్కెట్‌కు కొత్త ధాన్యం రావడం కూడా ధరల తగ్గుదలకు కారణమైంది. అయితే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో బియ్యం ధరలు ఇంకా అధికంగానే ఉన్నాయని, వాటిని కూడా నియంత్రించాలని వినియోగదారులు కోరుతున్నారు. గత నెలలో ధరల పెరుగుదల కారణంగా రేషన్ బియ్యానికి డిమాండ్ పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్