నవతెలంగాణ - మైదరాబాద్ : సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల పిల్లలకు పదో తరగతి వరకు ఉచిత విద్య అందించాలని యాజమాన్యం నిర్ణయించింది. సంస్థ పరిధిలోని 12 ఏరియాల్లో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది కార్మికుల కుటుంబాలకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూరనుంది. సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలోని 9 పాఠశాలల్లో ప్రస్తుతం చదువుతున్న 400 మందికి పైగా విద్యార్థులకు ఈ నిర్ణయం వర్తించనుంది. కొత్తగా చేరే విద్యార్థులకు కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ సదుపాయం కల్పించనున్నారు. కార్మికుల సంక్షేమం, కుటుంబాలపై విద్యా ఖర్చుల భారం తగ్గించే లక్ష్యంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు గుడ్ న్యూస్
48 నిమిషాల క్రితం
వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)