Magazines

తిరుపరంకుండ్రం కొండపై కార్తిక మహాదీపం.. సుప్రీంకోర్టు ఆదేశాల వేళ వివాదం

19 నిమిషాల క్రితం

Karthika Mahadeepam on Thiruparankundram hill.. Controversy over Supreme Court order
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌ : తమిళనాడులోని మధురై తిరుపరంకుండ్రం కొండపై మంగళవారం కార్తిక మహాదీపాన్ని ఆలయ అధికారులు ఉచ్చి పిళ్ళైయార్ దీప మండపంలో వెలిగించారు. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొండపై ఉన్న పురాతన ‘దీపత్తూన్’ వద్ద దీపం వెలిగించకపోవడంతో వివాదం, నిరసనలు చెలరేగాయి. పూర్వీకుల ఆచారాలు, ఆగమ శాస్త్ర సంప్రదాయాల ప్రకారమే మండపంలో దీపం వెలిగించినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. మరోవైపు, దీపత్తూన్ వద్ద దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారుల చర్యపై నిరసనలు వ్యక్తమయ్యాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో మధురైలో నిషేధాజ్ఞలు అమలు చేస్తూ సుమారు 6,000 మంది పోలీసులను మోహరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్