నవతెలంగాణ -హైదరాబాద్
భారతీయ రైల్వేల ప్రముఖ కేంద్రీకృత శిక్షణ సంస్థ అయిన ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్సి సిగ్నలింగ్ , టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ(ఇరిసెట్) మంగళవారం 69వ వార్షికోత్సవాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు సభ్యులు (ఇన్ఫ్రాస్ట్రక్చర్) వివేక్ కుమార్ గుప్తా , దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, రైల్వే బోర్డు అదనపు సభ్యులు (టెలికాం) శైలేష్ గుప్తా, ఇరిసెట్ డైరెక్టర్ జనరల్ పియూష్ కుమార్ గుప్తా, ఇతర సీనియర్ అధికారులు, అధ్యాపక బృందం ,శిక్షణార్థులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైల్వే బోర్డు సభ్యులు (మౌలిక సదుపాయాలు) వివేక్ కుమార్ గుప్తా మాట్లాడుతూ గత కొన్నేండ్లుగా రైల్వే సిగ్నలింగ్ , టెలికమ్యూనికేషన్స్ రంగాలలో జరిగిన గణనీయమైన అభివృద్ధి, రైలు కార్య కలాపాలను మరింత సురక్షితంగా, విశ్వసనీయతతోపాటు సమర్థవంతంగా మార్చడంలో దోహదపడిందని ప్రముఖంగా ప్రస్తావించారు. రైల్వే ఇంజినీరింగ్ అనేది నిరంతరం అభివృద్ధి చెందుతున్న రంగమనీ, వర్ధమాన సాంకేతికతలకు అనుగుణంగా ఉండటానికి నిరంతరం నేర్చుకోవడం, తిరిగి నేర్చుకోవడం అవసరమని చెప్పారు. అత్యాధునిక సాంకేతికతలలో సిబ్బందికి నైపుణ్యాభివృద్ధి కల్పించడంలో వివిధ విభాగాల భాగస్వాములకు శిక్షణ ఇవ్వడంలో ఇరిసెట్ పోషించిన పాత్రనూ ఆయన అభినందిం చారు .ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఏడు దశాబ్దాలకు పైగా రైల్వే వ్యవస్థను సజీవంగా, సురక్షితంగా పనిచేసేలా ఉంచే మేధావులకు శిక్షణ ఇవ్వడంలో ఐఆర్ఐఎస్ఈటీ (ఇరిసెట్) కీలక పాత్ర పోషిస్తున్నదని గుర్తుచేశారు. రైల్వే బోర్డు అదనపు సభ్యులు (టెలికాం) శైలేష్ గుప్తా మాట్లాడుతూ దేశం ఆశిస్తున్న లక్ష్యాలను సాధించేందుకు వినూత్న పరిష్కారాలను అన్వేషిం చడంతో పాటు, అత్యుత్తమ పనితీరును సాధించేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మౌలిక సదు పాయాల కల్పన, నిర్వహణ కోసం మునుపెన్నడూ లేని విధంగా మూలధన వ్యయంపెట్టుబడి వ్యయానికి తగ్గట్టుగా చేసినట్టు చెప్పారు. అనంతరం రైల్వేబోర్డు సభ్యులు (ఇన్ఫ్రాస్ట్రక్చర్) వివేక్ కుమార్ గుప్తా మాట్లాడుతూ ఈ ఏడాదిలో శిక్షణా కోర్సుల్లో ప్రతిభ కనబరిచిన టాపర్లకు అకడమిక్ బహుమతులు ప్రదానం చేశారు.





కామెంట్లు (0)