Magazines

‌హోంమంత్రి పదవికి రేవంత్‌‌రెడ్డి రాజీనామా చేయాలి

16 నిమిషాల క్రితం

Revanth Reddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌‌ డిమాండ్‌

నవతెలంగాణ బ్యూరో - హై‌దరాబాద్‌

హోంమంత్రిగా సీఎం రేవంత్‌‌రెడ్డి పనికిరారనీ, ఆ పదవికి రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్‌ ‌ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌‌కుమార్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ట్రిలియన్‌ ‌డాలర్ల కంపెనీ, ఫేస్‌‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌‌స్టాగ్రామ్‌ ‌నడుపుతున్న మెటా కంపెనీపై దాడి చేసిన యూత్‌ కాంగ్రెస్‌ ‌దుండగులను మూడు గంటలపాటు మాదాపూర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌‌లో పెట్టి వదిలేశారని చెప్పారు. వారిని సీఎం రేవంత్‌‌రెడ్డి మెచ్చుకుని ఉంటారని అన్నారు. ఈ దాడి సిగ్గుచేటన్నారు. గ్లోబల్‌ ‌సమ్మిట్‌ ‌పేరుతో ప్రపంచస్థాయి పరిశ్రమలను తెస్తున్నామని చెప్తూ బహుళజాతి సంస్థలపై దాడులు చేయడమేంటని ప్రశ్నించారు. హైదరాబాద్‌‌లో ఉగ్రవాదుల దాడికి సంబంధించిన మెయిల్‌ ‌లీకేజీపై విచారణ జరపాలని డిమాండ్‌ ‌చేశారు. ఆ మెయిల్‌‌ను బయటకు పంపేముందు ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ‌నాయకులపై అక్రమ కేసులను పెట్టడంపైనే పోలీసులు దృష్టి పెట్టారని చెప్పారు. హోంమంత్రిగా రేవంత్‌‌రెడ్డి ఉన్నంతకాలం ప్రజల ప్రాణాలకు రక్షణ లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, నాయకులు మంద శ్యాం, కొంకటి శేఖర్‌, శ్రీనివాస్‌ ‌యాదవ్‌, అబ్రార్‌ ‌హుస్సేన్‌, అరుణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్