నవతెలంగాణ - హైదరాబాద్ : ఢిల్లీలో ఓ కేఫ్‌లో 22 ఏళ్ల యువతిపై ఇద్దరు సహోద్యోగులు లైంగికదాడికి పాల్పడ్డారు. తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్‌లో ఉన్న కేఫ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కేఫ్ మూసివేసిన తర్వాత లోపలికి వెళ్లి ఎనిమిది మంది మద్యం సేవించారు. అనంతరం యువతిపై ఇద్దరు లైంగికదాడికి పాల్పడ్డారు. సామూహిక లైంగికదాడికి వీరిలో ఇద్దరు యువతులు సహకరించారు. యువతి ఫిర్యాదుతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు మహిళలు సహా ముగ్గురిని అరెస్టు చేశారు. మిగతావారు పరారీలో ఉన్నారు.





కామెంట్‌లు (0)