నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఎంపికైన సుమారు 4.72 లక్షల మంది పింఛన్‌దారులకు శుభవార్త అందించింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న పింఛన్ డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ నిధులను విడుదల చేయనున్నారు. 'చేయూత' పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు నెలకు రూ.2,000 చొప్పున పింఛన్ అందించనున్నారు. ఇదే కార్యక్రమంలో కోటి మంది మహిళలకు 'ఇందిరమ్మ చీరల' పంపిణీని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.





కామెంట్‌లు (0)