నవతెలంగాణ - హైదరాబాద్ : హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,500కు పైగా తగ్గి రూ.1,26,425కు చేరింది. గత ముగింపు ధర రూ.1,28,990గా ఉంది. కిలో వెండి ధర కూడా రూ.5వేలకు పైగా తగ్గి రూ.1,49,998కు దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 3,550 డాలర్లకు, వెండి 40.83 డాలర్లకు పడిపోయాయి.
కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర రూ.1,21,875గా, సిల్వర్ ఫ్యూచర్స్ కిలో ధర రూ.1,44,547గా కొనసాగుతోంది. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.54 గంటలకు సెన్సెక్స్ 1,436 పాయింట్లు పెరిగి 83,872 వద్ద, నిఫ్టీ 426 పాయింట్లు లాభంతో 25,776 వద్ద ట్రేడయ్యాయి. విదేశీ మదుపర్ల కొనుగోళ్లు, చమురు ధరల తగ్గుదల మార్కెట్లకు సానుకూలంగా మారాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.92.62గా నమోదైంది.





కామెంట్‌లు (0)