Magazines

ఖమ్మం జిల్లాలో విషాదం.. తల్లి, ఆరేళ్ల కుమారుడి మృతి

36 నిమిషాల క్రితం

Tragedy in Khammam district.. Death of mother and six-year-old son

Tragedy in Khammam district.. Death of mother and six-year-old son

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త మరణంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి విషం తీసుకున్న ఘటనలో తల్లి, చిన్న కుమారుడు మృతి చెందగా, పెద్ద కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కోనిజెర్ల మండలం లాలాపురానికి చెందిన రంజాన్ బీ (29) భర్త ఇటీవల మృతి చెందడంతో తీవ్ర ఆవేదనకు గురైంది. ఈ క్రమంలో ఈ నెల 19న ఆమె తన ఇద్దరు కుమారులతో కలిసి విషం తీసుకున్నట్లు సమాచారం. అస్వస్థతకు గురైన ముగ్గురిని కుటుంబ సభ్యులు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు.

చికిత్స పొందుతూ మంగళవారం చిన్న కుమారుడు నహీమ్ (6), అదే రోజు రాత్రి రంజాన్ బీ మృతి చెందారు. పెద్ద కుమారుడు నిస్సానొద్దీన్ (8) హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. బంధువు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్