నవతెలంగాణ - హైదరాబాద్ : అమెరికాలోని మిస్సిసిపీ నుంచి ఫ్లోరిడాకు బయలుదేరిన సెస్నా 210 విమానం మంగళవారం మధ్యాహ్నం గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో కూలిపోయింది. విమానంలో నలుగురు పెద్దలు, ఇద్దరు బాలురు సహా మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో విమానంతో సంబంధాలు తెగిపోయాయి. హార్న్ ఐలాండ్ సమీపంలో మూడు లైఫ్ జాకెట్లు, విమాన క్యాబిన్‌కు చెందిన భాగాలను గుర్తించినప్పటికీ ప్రయాణికుల ఆచూకీ ఇంకా లభించలేదు. కోస్ట్ గార్డ్ అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్టీఎస్బీ) సిద్ధమవుతున్నాయి.
గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో విమానం కూలి ఆరుగురు గల్లంతు
11 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)