Magazines

చించాలలో నెట్‌వర్క్ సమస్య పరిష్కరించాలి

8 నిమిషాల క్రితం

Network problem
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - ముధోల్
మండలంలోని చించాల గ్రామంలో నెలకొన్న నెట్‌వర్క్ సమస్యను పరిష్కరించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్‌ను గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో నెట్‌వర్క్ సదుపాయం సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల సౌకర్యార్థం నెట్‌వర్క్ సమస్యను త్వరితగతిన పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ వినతి పత్రం అందించిన వారిలో సర్పంచ్ సర్వేష్, ఉప సర్పంచ్ సాయినాథ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్