Magazines

మద్యం మత్తులో చిత్రహింసలు..నిద్రలోనే భర్తను సజీవదహనం చేసిన భార్య

15 నిమిషాల క్రితం

Wife burns husband alive

నిద్రలోనే భర్తను సజీవదహనం చేసిన భార్య

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ కంగ్టి

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం దేగుల్వాడి గ్రామంలో దారుణ హత్యోదంతం వెలుగుచూసింది. ఇంటి ఆవరణలో మంచంపై నిద్రిస్తున్న భర్త గునె జరప్ప (46)పై భార్య బుజ్జమ్మ (36)పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసింది. పోలీసుల వివరాల ప్రకారం..దేగుల్వాడికి చెందిన జరప్ప ఇంటి ఆవరణలో మంచంపై కాలిపోయిన స్థితిలో అనుమానాస్పదంగా మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, మృతుడి భార్య బుజ్జమ్మే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. మద్యానికి బానిసైన జరప్ప నిత్యం వేధింపులకు గురిచేస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన బుజ్జమ్మ, అతడు నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు విచారణలో తేలింది. నిందితురాలు బుజ్జమ్మను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా,న్యాయస్థానం రిమాండ్ విధించింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్