Magazines

ఉద్యమకారునికి పార్టీ తరఫున రూ.10 లక్షల నగదు సాయం

1 గంట క్రితం

Rs. 10 lakh cash assistance from the party to the activist
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

మాజీ మంత్రి హరీశ్‌ రావు

నవతెలంగాణ- బచ్చన్నపేట

ఉద్యమకారునికి పార్టీ తరపున రూ.10 లక్షలు నగదు సహాయం అందించిన‌ట్టు మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. మంగళవారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొన్నేగ్రామానికి చెందిన నికార్సైన ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ ఇంటికి చేరుకొని ఆయన కుటుంబాన్ని అక్కున చేర్చుకొని ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే పార్టీ తరపున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా భరోసా ఇచ్చినట్టు వారు తెలిపారు. ఉద్యమకారులకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. అనుకోని సందర్భంలో తమ్ముడు లక్ష్మణ్ గౌడ్ వీరమరణం పొందడం బాధాకరమని అన్నారు. నేడు పార్టీ తరఫున నగదుగా రూ.10లక్షలు అందిస్తున్నట్టు తెలిపారు. అలాగే, రాబోయే రోజుల్లో కుటుంబానికి అండదండగా ఉంటామని అన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా బాధిత కుటుంబానికి అవసరమైన వసతులతో పాటు పిల్లల చదువులు చూసుకుంటానని భరోసానివ్వ‌డం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి ఎటువంటి సహాయం కావాలన్నా అందించడానికి సిద్ధమని అన్నారు. వారివెంట రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షులు ఇరి రమణారెడ్డి, మండల అధ్యక్షులు బూర్గం చంద్రా రెడ్డి, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు గంగం సతీష్ రెడ్డి, నాయకులు చల్లా శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్‌లు ఎండి ఫిరోజ్, వడ్డేపల్లి మల్లారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్