Magazines

ఎమ్మెల్సీ అభ్యర్థి కొల్లి సత్యనారాయణకు ఎస్ఎఫ్ఐ సంపూర్ణ మద్దతు

51 నిమిషాల క్రితం

SFI extends full support to MLC candidate Kolli Satyanarayana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 2 నిమిషాల చదవడం

రాష్ట్ర కమిటీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

ఖమ్మం–వరంగల్–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి ప్రజాసంఘాలు బలపరిచిన ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) అభ్యర్థి సీనియర్ న్యాయవాది కొల్లి సత్యనారాయణకు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మంగళవారం హైదరాబాద్‌లోని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు ఎస్. రజనీకాంత్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు మాట్లాడుతూ కొల్లి సత్యనారాయణ విద్యార్థి దశలో ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ లో పనిచేస్తూ విద్యార్థి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని గుర్తుచేశారు.అనంతరం న్యాయవాదిగా ఖమ్మంలో ప్రాక్టీస్ చేస్తూ ప్రజల సమస్యలపై నిరంతరం స్పందిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు, యువత, ఉద్యోగులు, కార్మికులు, వివిధ సామాజిక వర్గాల సమస్యలపై సమగ్ర అవగాహన కలిగిన వ్యక్తి కొల్లి సత్యనారాయణ అని అన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన, సామాజిక స్పృహ, ప్రజా ఉద్యమాల పట్ల నిబద్ధత కలిగిన ఇలాంటి అభ్యర్థి శాసనమండలిలో ఉంటే నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావుల సమస్యలపై బలంగా గళం వినిపించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించి, వాటి పరిష్కారానికి కృషి చేసే నాయకత్వం నేటి సమాజానికి అవసరమని చెప్పారు. కాబట్టి ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్లు, విద్యార్థులు, యువజనులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు కొల్లి సత్యనారాయణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన విజయానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ అన్ని స్థాయిల్లో కృషి చేస్తుందని నాగరాజు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.మమత, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.కిరణ్, కె.అశోక్ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు జి.శ్రీకాంత్, భరత్, కార్తీక్, తారాసింగ్, ఎల్.రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు జె. రమేష్, కృపా జార్జ్, జ్ఞాపిక, శ్రీకాంత్, విఘ్నేష్, అర్జున్, స్మరణ్, రవితేజ, అభిషేక్, శ్రీనాథ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్