Magazines

జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలి

1 గంట క్రితం

జాబ్ క్యాలెండర్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

సీఎం రేవంత్ రెడ్డికి టీజేఎస్ వినతి

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలనీ, విద్యార్థులకు రావలసిన ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలని టీజేఎస్ కోరింది. ఈ మేరకు మంగళవారం టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు పలు ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎల్ నినో నేపథ్యంలో కౌలు రైతులను గుర్తించి వారికి ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చి కౌలు రైతులను, రైతులందరినీ ఆదుకోవాలని కోరారు. ఆంధ్రలో కలిపిన భద్రాచలంలోని ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.శంషాబాద్ నుంచి చెన్నయ్ ప్రతిపాదిత బుల్లెట్ రైలు జాతీయ రహదారి 65కి సమాంతరంగా సూర్యాపేట మీదుగా రైల్వే కారీడార్ ఏర్పాటుచేసే విధంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. సమస్యలను సావధానంగా విన్న ముఖ్యమంత్రి వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీజేఏస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.ఎల్. విశ్వేశ్వరరావు, ధర్మార్జున్, అంబటి శ్రీనివాస్, ముక్కెర రాజు, టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గోపగాని శంకర్ రావు, బైరి రమేష్, నిజ్జన రమేష్ ముదిరాజ్, ఆశప్ప, టీజేఏస్ అధికార ప్రతినిధి సలీమ్ పాషా, టీజేఏస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎం.నర్సయ్యలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్