Magazines

వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనుల వేగం పెంచాలి

53 నిమిషాల క్రితం

Warangal Super Speciality Hospital
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ పెండింగ్‌ పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రోడ్లు, భవనాల, ఆరోగ్యశాఖల ఉన్నతాధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. అల్వాల్‌, ఎల్‌‌బీనగర్‌ ‌టిమ్స్‌ ఆస్పత్రులు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణ పనుల పురోగతిపై మంగళవారం హైదరాబాద్‌‌లోని డాక్టర్‌ ‌బీఆర్‌ అంబేద్కర్‌ ‌తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి దామోదర ‌రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. వరంగల్‌ ‌సూపర్‌ ‌స్పెషాలిటీ ఆస్పత్రి ప్రతి ఫ్లోర్ ప్లాన్‌ను పరిశీలించారు. తొలుత ఔట్‌ పేషెంట్ వైద్య సేవలు ప్రారంభించనున్న నేపథ్యంలో అందుకు అవసరమైన రిజిస్ట్రేషన్ డెస్క్‌లు, ఓపీ కన్సల్టేషన్‌ రూమ్‌లు, ఫార్మసీ, డయాగ్నస్టిక్స్‌ తదితర సేవలకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెల 15వ తేదీ నాటికి ఔట్‌ పేషెంట్ సేవలకు సంబంధించిన అన్ని పనులు పూర్తవుతాయ‌ని నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఆరు ఆపరేషన్ థియేటర్లు సైతం సిద్ధమవుతాయని తెలిపారు. ఒక్కసారి రోగి ఆస్పత్రికి వచ్చాక మరో ఆస్పత్రికి రిఫర్ చేసే ప్రసక్తే ఉండకూడదనీ, అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందించే విధంగా సూపర్‌ ‌స్పెషాలిటీ ఆస్పత్రిలో సౌకర్యాలు ఉండేలా చూడాలని మంత్రి ఆదేశించారు.

ప్రభుత్వం నియమించిన డాక్టర్ల బృందం వరంగల్ సూపర్‌ ‌స్పెషాలిటీ, అల్వాల్, కొత్తపేట టిమ్స్‌ ఆస్పత్రులను రెగ్యులర్‌‌గా విజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అల్వాల్ టిమ్స్‌ పనులు సైతం చివరి దశలో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ఎక్విప్‌మెంట్ ఇన్‌స్టాలేషన్‌ జరుగుతోందని తెలిపారు. ఈ ఏడాది మార్చి నాటికి ఎల్‌బీ నగర్ టిమ్స్ పనులు చివర దశకు వస్తాయని అధికారులు తెలిపారు. పనులన్నీ స్పీడప్ చేయాలని, వీలైనంత త్వరగా ఆ ఆస్పత్రులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్