Magazines

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ చేర్చండి

11 నిమిషాల క్రితం

Take the government's achievements to every household.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్‌కు పునాది

ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు 
కార్యాచరణ సిద్ధం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను, సాధించిన అభివృద్ధిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీకి పునాదులని అన్నారు.ఆదివారం హైదరాబాద్‌‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. అంకితభావంతో పనిచేసే సామాన్య కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించి నాయకులుగా తీర్చిదిద్దడం పార్టీ సంప్రదాయమని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీ, అర్హులకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ ఆహార భద్రత పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనాలని పేర్కొన్నారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి, ఇతర పంటల ఉత్పత్తి నమోదవుతోందని, అందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులే ప్రధాన కారణమని అన్నారు. భారీగా ఖర్చు చేసినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం ఆశించిన ప్రయోజనం అందించడం లేదని విమర్శించారు. దాన్ని పునరుద్ధరించి ప్రజలకు ఉపయోగపడేలా చేయడానికి మరింత వ్యయం అవసరమవుతుందని, ఆ బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపైనే ఉందన్నారు. ప్రభుత్వ పథకాలు, విజయాలను ప్రతి ఇంటికీ వివరించాలని, ప్రజలతో నిరంతరం అనుసంధానంలో ఉండాలని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను కోరారు. ప్రజల ప్రయోజనాలను కాపాడుతూ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్