నవతెలం-గాణ హైదరాబాద్: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‍తో ఢిల్లీలో ఆందోళనకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కేను పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనలో పాల్గొనేందు ఇవాళ ముంబయి నుంచి ఢిల్లీ చేరుకున్న సీజేపీ ప్రధాన నేతలు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్ అశితోశ్ రంకాను పోలీసులు అరెస్టు చేశారు. వీరు ప్రయాణిస్తున్న విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ కాగానే పోలీసులు నేరుగా విమానంలోకి ప్రవేశించి ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
మరో వైపు జంతర్ మంతర్ వద్దకు వచ్చిన సీజేపీ కార్యకర్తలను పెద్ద ఎత్తున పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు 500 మందికిపై గా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నిరసనకారులెవరూ జంతర్ మంతర్ వద్దకు రాకుండా పోలీసులు నిలువరిస్తున్నారు. దీంతో నిరసనకాలు, పోలీసులతో ఢిల్లీ లో హెటెన్షన్ వాతావరణం నెలకొంది.






కామెంట్‌లు (0)