Magazines

పనామాలో భారీ భూకంపం

1 గంట క్రితం

earthquake
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలం-గాణ - హైదరాబాద్‌: పనామాలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దేశ దక్షిణ తీర ప్రాంతంలో 7.6 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం చోటుచేసుకుంది. ఈ ఘటనతో అధికారులు వెంటనే పసిఫిక్ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, తర్వాత ప్రమాదం తప్పిందని నిర్ధారించి వాటిని ఉపసంహరించుకున్నారు.

అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్‌జిఎస్) ప్రకారం, భూకంప కేంద్రం పిటలోజా అరిబా సమీపంలో, భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. భూకంప తీవ్రతను తొలుత 8.0గా అంచనా వేసినప్పటికీ, తర్వాత 7.6కు సవరించారు. ఈ భూకంపం ధాటికి రాజధాని పనామా నగరంతో పాటు పొరుగున ఉన్న కోస్టా రికా రాజధానిలోనూ భవనాలు తీవ్రంగా కంపించాయి. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. పెనోనోమే నగరంలోని ఒక కేథడ్రల్ టవర్ కూలిపోయిందని, మరికొన్ని నిర్మాణాలకు నష్టం వాటిల్లిందని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్