నవతెలంగాణ-హైదరాబాద్: ఫ్లై దుబాయ్ ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దుబాయ్‌లో మరో ఇద్దరు ఫ్లైదుబాయ్ పైలట్లను అరెస్టు చేశారు. అరెస్టైన ఇద్దరు గతంలో ఇజ్రాయెల్‌కు విమానాలు నడిపినట్లు తెలుస్తోంది. ఫ్లైదుబాయ్‌లో ప్రస్తుతం ఉన్న ఆరుగురు మాల్దీవియన్ పైలట్లలో వీరు ఇటీవలే చేరారు. సెప్టెంబర్ 30న విమానాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒమన్ సహ-పైలట్ హమామ్ అల్-హమ్మామితో కలిసి వీరు పనిచేశారని సమాచారం.
కాగా, గతనెల సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ బయల్దేరిన ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ కెప్టెన్‌పై కత్తితో దాడి చేశారు. కాక్‌పిట్ నుంచి శబ్దాలు వినపడగానే.. ఇదే విమానంలో ఆఫ్‌డ్యూటీలో ఉన్న పైలట్లు, ప్రయాణికులు కో-పైలట్‌ను అడ్డుకున్నారు. అప్పటికే కెప్టెన్, ఫస్ట్ ఆఫీసర్ గాయపడ్డారు. కాక్‌పిట్ అంతా రక్తపు మరకలు ఉన్నాయి. ఆఫ్‌డ్యూటీలో ఉన్న ఇద్దరు పైలట్లు విమానాన్ని సురక్షితంగా సౌదీ అరేబియాలో ల్యాండ్ చేశారు. దీంతో పెద్ద పెను ప్రమాదం తప్పింది.






కామెంట్‌లు (0)