Magazines

ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు

50 నిమిషాల క్రితం

Bomb threat to Air India flight
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఎయిర్‌ ఇండియా విమానం ఏఐ 2030కు బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో విమానాన్ని జైపూర్‌ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. విమానం దిగిన వెంటనే భద్రతా సిబ్బంది ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. బెదిరింపు ఎక్కడి నుంచి వచ్చింది, విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్