నవతెలంగాణ - హైదరాబాద్: దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో హైదరాబాద్‌లోని ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. తెలంగాణలో పాఠశాలలకు శనివారం నుంచి దసరా సెలవులు ప్రకటించడంతో, శుక్రవారం సాయంత్రం నుంచే సొంతూళ్లకు వెళ్లేవారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. నగరంలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్), జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. కుటుంబ సభ్యులు, విద్యార్థులతో బస్టాండ్ల ప్రాంగణాలన్నీ సందడిగా మారాయి.
అయితే, ఈ ప్రత్యేక బస్సు సర్వీసుల్లో ఛార్జీలను 1.5 రెట్లు (50 శాతం అదనంగా) పెంచినట్లు టీజీఎస్ఆర్టీసీ వెల్లడించింది. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే అక్టోబర్ 9, 10, 16, 17 తేదీలతో పాటు, తిరుగు ప్రయాణ రద్దీ ఉండే అక్టోబర్ 25, 26 తేదీల్లో ఈ పెంచిన ఛార్జీలు వర్తిస్తాయి. సాధారణ బస్సు సర్వీసుల్లో ఛార్జీలలో ఎలాంటి మార్పు లేదని, 'మహాలక్ష్మి' పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.






కామెంట్‌లు (0)