Magazines

జైలర్‌ 2 టికెట్‌ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి

1 గంట క్రితం

JAILER 2
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలం-గాణ హైదరాబాద్: సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'జైలర్ 2' టికెట్ ధరలను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. దసరా పండుగ కానుకగా అక్టోబరు 15న ఈ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో, తొలి వారం రోజుల పాటు పెంచిన ధరలు అమల్లో ఉంటాయని పేర్కొంటూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌ ధరపై గరిష్ఠంగా రూ. 50 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌లలో రూ. 75 (జీఎస్టీతో కలిపి) అదనంగా వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ పెరిగిన ధరలు సినిమా విడుదలైన అక్టోబరు 15 నుంచి అక్టోబరు 21 వరకు, అంటే వారం రోజుల పాటు వర్తిస్తాయి. దీనితో పాటు, తొలి వారం రోజుల్లో ప్రతిరోజూ ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా ప్రభుత్వం థియేటర్ యాజమాన్యాలకు అనుమతి ఇచ్చింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్