నవతెలంగాణ - హైదరాబాద్ : హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐఎస్‌బీ రోడ్డులో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మారుతి సుజుకి షోరూమ్ సమీపంలో అతివేగంతో వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగి సగానికిపైగా కాలిపోయింది. కారులోని ప్రయాణికులు సకాలంలో బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





కామెంట్‌లు (0)