నవతెలంగాణ - హైదరాబాద్ : పెళ్లి చేసుకుంటానని నమ్మించి తొమ్మిదేళ్లుగా ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బాలస్వామిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్‌లో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను సైదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
నల్గొండ జిల్లాకు చెందిన మహిళకు 2016లో చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌లో అప్పటి అడ్మిన్ ఎస్‌ఐ బాలస్వామితో పరిచయం ఏర్పడింది. తాను అవివాహితుడినని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెకు దగ్గరయ్యాడు. తనకు అప్పటికే వివాహమైన విషయం బయటపడటంతో, విడాకులు తీసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించినట్లు బాధితురాలు ఆరోపించింది. 2021లో ఆమె భర్త మరణించిన తర్వాత కూడా సహజీవనం కొనసాగించాడని, 2025 జనవరి నుంచి దూరం పెట్టడంతో మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాలస్వామిని అరెస్ట్ చేశారు.





కామెంట్‌లు (0)