Magazines

ఫ్లైదుబాయ్ హైజాక్ కుట్ర.. మరో ఇద్దరు పైలట్ల అరెస్ట్

2 గంటల క్రితం

FlyDubai hijack conspiracy: Two more pilots arrested
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఫ్లైదుబాయ్ విమానాన్ని హైజాక్ చేసి ఇజ్రాయెల్‌లో కూల్చివేసేందుకు పన్నిన కుట్ర కేసులో దుబాయ్ పోలీసులు మరో ఇద్దరు పైలట్లను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ మాల్దీవులకు చెందినవారని, ఇటీవలే ఫ్లైదుబాయ్‌లో విధుల్లో చేరారని సమాచారం. విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించిన ఒమన్ కో-పైలట్‌తో వీరికి సంబంధాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గత నెల 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న విమానంలో కో-పైలట్ హమామ్ అల్-హమామీ.. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై గొడ్డలితో దాడి చేసినట్లు కథనాలు పేర్కొన్నాయి. కెప్టెన్‌ను ఓ ఇజ్రాయెల్ ప్రయాణికుడు ఆదుకోవడంతో విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో విమాన సిబ్బంది పాత్రపైనా ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్