నవతెలంగాణ - హైదరాబాద్ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు (అక్టోబర్ 14) దర్శించుకోనున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం 6:25 గంటలకు గన్నవరం చేరుకోనున్న రాష్ట్రపతి.. రాత్రి 7:10 నుంచి 7:40 గంటల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకోనున్నారు. నేడు అమ్మవారు శ్రీ మహాచండీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆమె నోవాటెల్ హోటల్లో బస చేయనున్నారు. అక్టోబర్ 15న ‘సరస్ మేళా’ను ప్రారంభించనున్నారు.
నేడు కనకదుర్గమ్మ దర్శనానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్లు (0)