నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని, ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఎంపీలు చేపట్టిన ర్యాలీని మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్తున్న ర్యాలీని నీతి ఆయోగ్ కార్యాలయం సమీపంలో పోలీసులు నిలిపివేయడంతో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎన్‌సీపీ-ఎస్‌పీ ఎంపీ సుప్రియా సూలేతో పాటు పలువురు ప్రతిపక్ష ఎంపీలు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రధాని మోడీ, అమిత్ షా, సిఇసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలని నినాదాలు చేశారు. దీంతో ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది.
ఇండియా కూటమి నేతలు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సిఇసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం నీతి ఆయోగ్ కార్యాలయం సమీపంలో ఎంపీలు బైఠాయించి నిరసన కొనసాగించారు. పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో ప్రతిపక్ష ఎంపీలు, పోలీసుల మధ్య కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.





కామెంట్‌లు (0)