Magazines

మహారాష్ట్రలో అమానుషం..విద్యార్థులకు సగం గుండు

1 గంట క్రితం

Maharashtra
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో హెయిర్‌ కట్‌ సమయంలో విద్యార్థులు ఆడుకునేందుకు వెళ్లడంతో ఆగ్రహించిన సూపరింటెండెంట్‌ వారికి సగం గుండు చేయించారు. శిక్ష‍గా సుమారు 82 మంది విద్యార్థులకు సగం గుండు చేయించినట్లు సమాచారం. ఈ ఘటన శనివారం చిమూర్ తాలూకాలోని జంబుల్‌ఘాట్‌లోని ప్రభుత్వ సెకండరీ ఆశ్రమ పాఠశాలలో జరిగింది.


వివరాల ప్రకారం.. పాఠశాలలో శనివారం విద్యార్థులకు హెయిర్‌ కట్‌ చేయించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో కొంతమంది పిల్లలు ఆడుకుంటుండటంతో, సూపరింటెండెంట్‌ ప్రశాంత్ మెష్రామ్‌కి విపరీతమైన ఆగ్రహం వచ్చింది. దీంతో సూపరింటెండెంట్, క్రమశిక్షణా చర్యగా విద్యార్థులకు సగం గుండు చేయమని ఆదేశించారు. ట్రిమ్మర్‌ను ఉపయోగించి విద్యార్థుల జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించడంతో, హెయిర్‌ అసమానంగా తయారైంది. సరిగ్గా గుండు చేయని, అసమానమైన జుట్టుతో ఉన్న విద్యార్థుల ఫొటోలు బయటకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఫొటోలపై ఉన్నతాధికారులు పాఠశాలను సంప్రదించి విద్యార్థులందరికీ ఒకే రకమైన హెయిర్ కట్ ఉండేలా చూడాలని ఆదేశించినట్లు సమాచారం దీంతో శనివారం రాత్రి విద్యార్థులకు మరోసారి హెయిర్‌ కట్‌ చేశారు. రాత్రి 11.00 గంటల సమయంలో కొందరు విద్యార్థులు నిద్రించడానికి సిద్ధమవుతున్న వేళ హెయిర్‌ కట్‌ చేశారు. ఆదివారం తెల్లవారుజామున 4.00 గంటల వరకు కొనసాగినట్లు సమాచారం.


సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీసు

పాఠశాల సూపరింటెండెంట్ ప్రశాంత్ మెష్రామ్ పాఠశాల ప్రిన్సిపాల్‌ ప్రశాంత్‌ గిరి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన చర్యలను సమర్థించుకున్నారు. వర్షాలు, ఇతర కారణాల రిత్యా కొంతకాలంగా విద్యార్థులు సరిగా హెయిర్‌ కట్‌ చేయించుకోవడం లేదని, మరికొందరు హెయిర్‌ పరిశుభ్రతను కూడా పాటించడం లేదని అన్నారు. దీంతో విద్యార్థుల ఆరోగ్య పరిరక్ష‍ణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని, దీని వెనుక ఎటువంటి దురుద్దేశం లేదని అన్నారు. ఈ ఘటనపై సమగ్రమైన, నిష్పక్ష‍పాతమైన దర్యాప్తు చేపట్టాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్