తెర పైకి తెచ్చిన ట్రంప్
న్యూఢిల్లీ : ఇరాన్ నుంచి ఎదురవుతున్న ఇంధన సరఫరా సమస్యలకు పరిష్కారంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్-మధ్యప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్ (ఐఎంఈసీ)ను తెర పైకి తెచ్చిన విషయం తెలిసిందే. పశ్చిమాసియా యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో ట్రంప్ ఈ కారిడార్‌ను ప్రతిపాదించారు. వాణిజ్య నౌకలపై ఇరాన్ జరిపిన దాడుల కారణంగా మధ్యప్రాచ్యంలోని ఇంధన మౌలిక సదుపాయాలను టెహ్రాన్ చెక్‌పాయింట్ల నుంచి తరలించాల్సిన అవసరం ఉన్నదని ట్రంప్ చెబుతున్నారు. పైప్‌లైన్ ద్వారా కానీ లేదా వేరే విధంగా కానీ చమురును బయటికి తరలించేందుకు ఐఎంఈసీ లేదా ఇతర ప్రదేశాలు అవసరమని భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఇరాన్ నియంత్రణలోని జలమార్గాలకు ఇది ప్రత్యామ్నాయమని ఆయన తెలిపారు. భారత్ నేతృత్వంలోని ఐఎంఈసీ ఆసియా, గల్ఫ్, యూరప్ మధ్య వాణిజ్యాన్ని, ఇంధన భద్రతను బలోపేతం చేస్తుందని అమెరికా చెబుతోంది.
ఏమిటీ కారిడార్ ?
న్యూఢిల్లీలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశంలో ఐఎంఈసీ కారిడార్‌ను ప్రతిపాదించారు. ఇది ఆసియా, అరేబియా గల్ఫ్, యూరప్‌లో వాణిజ్యం, ఇంధన సరఫరాలను పెంచడానికి, డిజిటల్ ఏకీకరణకు ఉద్దేశించిన బహుళ రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్. దీనిలో భారత్, అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ భాగస్వాములు. సంప్రదాయ సముద్ర, రహదారి వాణిజ్య మార్గాలకు అనుబంధంగా తక్కువ ఖర్చుతో కూడిన, అత్యంత వేగవంతమైన ఓడ-రైలు రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడం దీని ప్రధాన లక్ష్యం. కారిడార్‌లోని తూర్పు మార్గం భారత్‌ను అరేబియా గల్ఫ్‌కు కలుపుతుంది. ఉత్తర మార్గం అరేబియా గల్ఫ్‌ను ఐరోపాకు కలుపుతుంది.
ఇరాన్ సమస్యకు ఐఎంఈసీ పరిష్కారం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)