ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ డ్రా
బెంగళూరు: పనామాతో జరిగిన ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను భారత్ డ్రా చేసింది. బెంగళూరులో కంఠీరవం స్టేడియంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. భారత రియాన్ విలియమ్స్ ఏకైక గోల్ చేయగా.. ఆపై మెన్ ఇన్ బ్లూ పట్టుదలతో ఆడింది. ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పనామా ఫార్వర్డ్స్‌ను అడ్డుకొని, వారి గోల్ ప్రయత్నాలను తిప్పికొట్టి 1-1తో డ్రా చేసుకుంది. ఫిఫా వరల్డ్‌కప్ ఆడిన 44వ ర్యాంకర్ పనామాతో తలపడిన టీమిండియా(138వ ర్యాంక్) బలమైన డిఫెన్స్‌తో ఆకట్టుకుంది. ఆద్యంతం నువ్వా-నేనా అన్నట్టు సాగిన మ్యాచ్‌లో రియాన్ విలియమ్స్ భారత్‌కు తొలి గోల్ అందించాడు. ఇది తొలి అర్ధభాగం చివర్లో 41వ నిమిషంలో ప్రత్యర్థి గోల్ కీపర్‌ను బోల్తా కొట్టించిన రియాన్ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. కానీ, బెంచ్‌పై నుంచి మైదానంలోకి వచ్చీ రాగానే జేవియర్ వాలెన్సియా గోల్ కొట్టాడు. దూరం నుంచి అతడు కిక్ చేసిన బంతి బాక్స్ అవతలకు పడేలా అనిపించినా.. చివరకు నెట్‌లోకి దూసుకెళ్లింది. దాంతో, ఇరుజట్ల స్కోర్లు సమం అయ్యాయి. డిఫెన్స్, ఆటాకింగ్ పరంగా అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా 1-1తో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. తదుపరి ఫ్రెండ్లీ మ్యాచుల్లో గుర్‌ప్రీత్ సారథ్యంలోని భారత్ అక్టోబర్ 3న బ్రెజిల్‌తో తలపడనుంది.







కామెంట్‌లు (0)