Magazines

గంగారంలో ఘనంగా వీరనారి ' ఐలమ్మ' జయంతి వేడుక

3 గంటల క్రితం

sattupally
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి 

​సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, ​వీరనారి చిట్యాల (చాకలి) ఐలమ్మ 131వ జయంతి వేడుకను శ్రీవీరభద్ర రజక సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. గ్రామంలోని చాకలి ఐలమ్మ భవనం వద్ద ఉన్న ​ఆమె విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సంఘ నాయకులు పతాకావిష్కరణ చేశారు. ఈ వేడుకలో భాగంగా రజక సంఘ సభ్యులు, రజక కుటుంబాల సభ్యులు గ్రామంలో భారీ మోటార్‌ సైకిల్ ర్యాలీని నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ​అభివృద్ధి ప్రదాత దాసరి వెంకటరామిరెడ్డి (చిట్టి నాయన) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీవీరభద్ర రజక సంఘం అధ్యక్షులు కొండపల్లి ఫల్గుణుడు, రజక సంఘ ప్రతినిధులు, ​రజక కుటుంబాల సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన పలువురు వక్తలు భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం ఐలమ్మ చేసిన వీరోచిత పోరాటాన్ని స్మరించుకున్నారు. నైజాం నవాబులు, జమీందార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ఆమె చూపిన

​ధైర్యసాహసాలు తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయని కొనియాడారు. ఆమె పోరాట స్ఫూర్తిని రేపటి తరానికి అందిస్తూ, ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్