సర్ ప్రక్రియను తక్షణమే నిలిపేయాలి
తొలగించిన ఓట్లలో అర్హులైన వారిని చేర్చాలి
సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డిమాండ్
కలెక్టర్ ఆపీస్ వద్ద అఖిల పక్ష పార్టీల ధర్నా
నవతెలంగాణ-సంగారెడ్డి
ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలని, సర్ ప్రక్రియను తక్షణమే నిలిపేయాలని సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డిమాండ్ చేశారు. భారత ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే తొలగించాలని, సర్ ప్రక్రియను తక్షణమే నిలిపేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం వద్ద అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన ఏవో విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్బంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కిరణ్ గౌడ్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెహమాన్, బి ఆర్ ఎస్ నాయకులు శ్రవణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలని, సర్ ప్రక్రియను తక్షణమే నిలిపేయాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం పౌరులకు వచ్చిన ప్రజాస్వామిక రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ దేశంలో 13 కోట్ల మంది ఓటర్లను తొలగించడం అన్యాయం, అక్రమం అని అన్నారు. తొలగించిన ఓట్లను వెంటనే తిరిగి పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. జ్ఞానేష్ కుమార్ ఇతర ఇద్దరు కమిషనర్ చెప్పిన వినకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ బిజెపికి ఏజెంట్ లాగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.
తక్షణమే జ్ఞానేష్ కుమార్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తొలగించిన ఓట్లలో అర్హులైన వారిని చేర్చాలని అన్నారు. ఫార్మ్ 6 ను పాత పద్ధతి లో కొనసాగించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జ్ఞానేశ్ కుమార్ ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. జ్ఞానేష్ కుమార్ ను తొలగించేదాకా పోరాటం కొనసాగుతుందని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే పోరాటంలో అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. మల్లేశం మాణిక్యం సాయిలు, నాయకులు యాదగిరి, అశోక్, వెంట్రాజం, బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)