Magazines

మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే 

2 గంటల క్రితం

mallapur
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులు  సుధాకర్ రెడ్డి

నవతెలంగాణ-మిడ్జిల్ 
రాబోయే రోజుల్లో రాష్ట్రంతో పాటు దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మల్లాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా శనివారం ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు,వితంతు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు అందే విధంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అర్హులందరికీ స్మార్ట్‌ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని వివరించారు. సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామాభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ యువకులు, మహిళలు, మాజీ ప్రజాప్రతినిధులు ముందు ఉండాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్